Aamir Khan: చెన్నై వరదల్లో చిక్కుకున్న అమీర్ ఖాన్… రక్షించిన రెస్క్యూ టీమ్స్

చెన్నై వరదల్లో చిక్కుకున్న అమీర్ ఖాన్... రక్షించిన రెస్క్యూ టీమ్స్

Hello Telugu - Aamir Khan

Aamir Khan: మిగ్‌జాం తుపాను చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసింది. తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో ఇళ్ళల్లోకి నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కారప్పాకంలో నివాసం ఉంటున్న టాలీవుడ్ హీరో విష్ణు విశాల్ సహాయం కోసం… తమిళనాడు ప్రభుత్వం, అధికారులను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు.

Aamir Khan – సహాయం కోసం సోషల్ మీడియా ద్వారా అర్జించిన విష్ణు

తాను ఉంటున్న కారప్పాకంలోని ఇంట్లోకి వరద నీరు వచ్చిందని, క్రమంగా ఉద్ధృతి పెరుగుతోందని తెలిపారు. ‘‘విద్యుత్తు, ఇంటర్నెట్‌ లేదు. ఫోన్‌ సిగ్నల్‌ కూడా సరిగా అందడం లేదు. ఇంటిపై ఓ చోట మాత్రమే సిగ్నల్‌ వస్తుంది. అక్కడ నుంచే ఇది పోస్ట్‌ చేస్తున్నా. నాకే కాదు ఈ ప్రాంతంలో ఉంటున్న వారికి సాయం అవసరమని… చెన్నై ప్రజల అవస్థను చూస్తుంటే బాధగా ఉంది’’ అంటూ సంబంధిత ఫోటోలను విష్ణు విశాల్‌ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్‌ చేసాడు.

విష్ణు పోస్ట్ కు స్పందించి యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన అధికారులు

విష్ణు విశాల్ పోస్టు పెట్టిన కొద్ది సేపటికే చెన్నై ఫైర్‌, రెస్క్యూ విభాగాలు స్పందించాయి. యుద్ధ ప్రాతిపదికన కారప్పాకం ఏరియాలో సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ విషయాన్ని విష్ణు విశాల్‌ తాజాగా మరో పోస్ట్‌ ద్వారా తెలియజేస్తూ తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కష్ట సమయంలో ఆదుకుందని ప్రశంసించారు. అయితే ఆ రెస్క్యూ టీమ్‌తో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమిర్‌ ఖాన్‌(Aamir Khan) కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అమీర్ ఖాన్ కూడా కరప్పాకంలో వరదల్లో చిక్కుకున్నాడు. అయితే విష్ణు విశాల్ సమాచారంతో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు… అమీర్ ఖాన్ ను కూడా వరద ప్రాంతం నుండి రక్షించారు.

‘అరణ్య’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన విష్ణు విశాల్

‘అరణ్య’, ‘ఎఫ్‌.ఐ.ఆర్‌’, ‘మట్టి కుస్తీ’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన విష్ణు విశాల్‌… త్వరలో ‘లాల్‌ సలామ్‌’ తో సందడి చేయనున్నారు. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్‌ కీలక పాత్ర పోషించనున్నారు. రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2024 సంక్రాంతికి విడుదల కానుంది.

Also Read : Mithun Ramesh: మలయాళ నటుడుకి అరుదైన బెల్స్ పాల్సీ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com