Aamir Khan : ముంబై – బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది అనుకున్నట్లు దక్షిణాధి సినిమాలు డామినేట్ చేయడం లేదన్నారు. ఇదంతా ఒట్టి అభిప్రాయం మాత్రమేనని పేర్కొన్నారు. హిందీ సినిమాలు ఆడక పోవడం, నిరాదరణకు గురి కావడం ఎందుకని ఆలోచిస్తే చాలా కారణాలు ఉన్నాయని అన్నారు. కథా పరంగా అద్భుతంగా వస్తున్నాయని, ఇందులో కొన్ని సినిమాలు ఏ మాధ్యమాలతో సంబంధం అన్నది లేకుండా సక్సెస్ అయిన దాఖలాలు కూడా ఉన్నాయని చెప్పారు.
Aamir Khan Movies..
ప్రధానంగా బాలీవుడ్ కు సంబంధించి మూవీస్ పై ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది ఓటీటీలేనని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లనే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయని వాపోయారు అమీర్ ఖాన్(Aamir Khan). బాలీవుడ్ చూస్తూ ఉండగానే పతనం చెందుతుండడం తనను మరింత బాధకు గురి చేసేలా చేసిందన్నారు. ఆయన చిట్ చాట్ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది సినిమాలా లేక దక్షిణాది సినిమాలా అన్నది ముఖ్యం కాదన్నారు అమీర్ ఖాన్.
బాలీవుడ్ కు ప్రధానంగా నష్టం జరుగుతున్నది కేవలం ఓటీటీలేనని ఆరోపించారు. ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న ప్రేక్షకులు కొన్ని వారాల తర్వాత హాయిగా ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తున్నారని చెప్పారు. ఓటీటీలు లేక పోయి ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే వారని, మూవీస్ నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.
Also Read : David Warner 1st Look Sensational :డేవిడ్ వార్నర్ రాబిన్ హుడ్ ఫస్ట్ లుక్