Aamir Khan: రజనీకాంత్ సినిమాలో ఆమిర్‌ఖాన్‌ ?

రజనీకాంత్ సినిమాలో ఆమిర్‌ఖాన్‌ ?

Hello Telugu - Aamir Khan

Aamir Khan: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు ఆమిర్ ఖాన్. బాలీవుడ్ మిస్టర్ ఫెర్ఫెక్ట్ గా ఎన్నో విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆమిర్ ఖాన్ త్వరలో ‘సితారే జమీన్‌ పర్‌’తో రావడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో ఇప్పుడీయన మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతుందని బీటౌన్ టాక్. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు సంపాదించిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తో ఆమిర్ ఖాన్(Aamir Khan) తరువాత సినిమా ఉండబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. దీనితో వీరిద్దరి కాంబినేషన్ కోసం ఎదురుచూసే అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారట దర్శకుడు లోకేశ్ కనగరాజ్.

Aamir Khan Movie Updates

ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్… సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో ‘కూలీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సన్ పిక్ఛర్స్ నిర్మిస్తోండగా… మ్యూజిక్ సన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ ఫెర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాలో ఆమిర్‌ ఖాన్‌ అతిథి పాత్రలో మెరవనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమై ఆయనతో చిత్రబృందం చర్చలు జరుపుతుందట. త్వరలో పూర్తి వివరాల్ని అధికారికంగా ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరి తొలిసారి కలిసి నటిస్తున్న రజనీ, ఆమిర్‌ల హంగామా తెరపై ఎలా ఉండనుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

Also Read : Writer Nadiminti Narsinga Rao: ప్రముఖ మాటల రచయిత నరసింగరావు కన్నుమూత !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com