Aamir Khan : ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్లలో కంటే OTTలోనే సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఏ సినిమా రిలీజైనా ఓటీటీలోనే చూడాలి అనే ఆలోచనకు వచ్చారు చాలా మంది. దీనికి అడ్డు కట్ట వేసేందుకు బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్ ఓ పెద్ద ప్లాన్ వేశారు. సాధారణంగా సినిమా బాగుంటే రెండు నెలల తర్వాత ఓటీటీకి సినిమా వస్తుంది. కానీ సినిమా గురించి నెగెటివ్ టాక్ వస్తే మాత్రం నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. ఈ కారణంగానే చాలా మంది థియేటర్లలో కంటే ఓటీటీల్లోనే సినిమాలు చూసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓటీటీల జోరుకు అడ్డు కట్ట వేసేందుకు ఆమిర్ ఖాన్(Aamir Khan) పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇకపై తన సినిమా హక్కులను OTTలకు విక్రయించకూడదని ఈ మిస్టర పర్ఫెక్షనిస్ట్ నిర్ణయించుకున్నాడని సమాచారం.
Aamir Khan Movies..
అమీర్ ఖాన్ హీరోగానే కాదు నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. సినిమాల కోసం కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నాడు. ఈ కారణంగా, అతను తన సినిమా డిజిటల్ హక్కులను ప్రీ-సేల్ చేయకూడదని నిర్ణయించుకున్నాడని సమాచారం. సినిమా విడుదలైన 12 వారాల పాటు అంటే మూడు నెలల వరకు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమ్మకూడదని ఆమిర్(Aamir Khan) నిర్ణయించుకున్నారు. దీని ద్వారా మరింత బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టాలని ఆలోచిస్తున్నారు. ఒకసారి సినిమా బాగోలేకపోతే ఓటీటీ తక్కువ మొత్తం అడుగుతుంది. అయితే, వారు దీని గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు. ఇది విజయవంతమైతే అందరూ ఇదే టెక్నిక్‌ని ఉపయోగించుకోవచ్చు. మరి ఇది ఏ మేర సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఆమీర్ ఖాన్ ప్రస్తుతం ‘సితారే జమీన్ పర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 20న సినిమా విడుదల కానుంది. ‘ లాల్ సింగ్ చద్దా’ తర్వాత అమీర్ ఖాన్ చాలా గ్యాప్ తీసుకుని మరీ సినిమాల్లో నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తో ఆమిర్ ఖాన్ సినిమా.
Also Read : Mathu Vadalara 2 : ప్రభాస్ చేతుల మీదుగా రిలీజైన ‘మత్తు వదలరా 2’ ట్రైలర్