Aamir Khan : సినిమా ఫీల్డ్ లో జయాపజయాలు చాలా సర్వసాధారణం. ఏదైనా సినిమాను తెరకెక్కించేంత వరకే హీరో, నిర్మాత, దర్శకుని బాధ్యత… అది హిట్టా, ఫట్టా అనేది తేల్చాల్సిందే ప్రేక్షకులే. కొన్నికథలు రాసేటప్పుడు దర్శకులు, విన్నప్పుడు హీరోలు ఆ సినిమాల ఫలితంపైన విపరీతమైన నమ్మకం పెట్టుకుంటారు. అయితే సినిమా పూర్తయిన తరువాత… దానిని కథలో లోపమో, కథనంలో లోపమో, తెరకెక్కించిన తీరులో లోపమో తెలుసుకునే లోపే కొన్ని సినిమాలు డిజాస్టర్ గా మిగిలిపోతుంటాయి.
ఎంతో నమ్మకం పెట్టుకున్న సినిమా… డిజాస్టర్ గా మిగిలితే దానిని నుండి కోలుకోవడానికి నిర్మాతలతో పాటు హీరోలకు కూడా చాలా సమయం పడుతుంది. దీనికి కొత్త పరిశ్రమలో అడుగుపెట్టిన యువ హీరోలతో పాటు బ్లాక్ బస్టర్ హిట్లు సాధించిన బడా స్టార్లు కూడా అతీతులు కారు. దీనికి అమీర్‌ఖాన్(Aamir Khan) హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
Aamir Khan – అమీర్ ను తీవ్ర నిరాశకు గురిచేసిన ‘లాల్ సింగ్ చడ్డా’ ఫలితం
అమీర్‌ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’. ఆస్కార్ అవార్డు దక్కించుకున్న ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్‌గా రూపొందించిన ఈ సినిమాలో కరీనాకపూర్, నాగచైతన్య, మానవ్ విజ్, మోనాసింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలన్నీ తలక్రిందులయ్యేలా ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమాపై ఎంతో నమ్మకం పెట్టుకున్న హీరో అమీర్ ఖాన్(Aamir Khan)… ఫలితం తేడాగా వచ్చేసరికి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వూలో ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా గురించి క్యాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చబ్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
‘లాల్ సింగ్ చడ్డా’ ఫలితంపై బాధపడ్డ అమీర్ ఖాన్
‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా పరాజయం తర్వాత టీమ్ అందరి కోసం ఆమిర్ ఖాన్(Aamir Khan) ప్రత్యేకంగా పార్టీ ఇచ్చాడని క్యాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చబ్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమా దర్శక నిర్మాతలతోపాటు నటీనటులు, సహాయ సిబ్బంది అందరూ అందులో ఈ పార్టీలో పాల్గొన్నారన్నారని…
ఈ సందర్భంగా ‘లాల్ సింగ్ చడ్డా’ను తీర్చిదిద్దడంలో టీమ్‌లోని ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని.. వారి వర్క్‌ను మెచ్చుకున్నారన్నారు. అయితే సినిమా డిజాస్టర్ గా నిలవడం పట్ల… తప్పంతా తనదే అంటూ ఆ రోజు ఆమిర్ ఎంతో బాధపడ్డారని ముకేశ్ తెలిపారు. దీనితో అమీర్ లాంటి హీరోలు కూడా సినిమా ఫలితంపై ఇంత వేదన చెందుతారా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే సినిమా ఘోర పరాజయంతో నైరాశ్యంలో ఉన్న చిత్ర యూనిట్ ను ఈ విధంగా పార్టీ పెట్టి వారిలో మనోధైర్యం నింపడం పట్ల అమీర్ ఖాన్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Also Read : Dimple Hayathi: గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన డింపుల్ హయతి