Aamir Khan: దేశానికి రాజు అయిన అమ్మకు కొడుకే అనే సామెత… ఇప్పుడు సరిగ్గా బాలీవుడ్ స్టార్ హీరోకు ఖచ్చితంగా సరిపోయింది. అమీర్ ఖాన్ ఎంత పెద్ద హీరో అయినప్పటికీ… తన కుమార్తె ఐరా ఖాన్ కు పెళ్లి చేసి మరోకరి ఇంటికి పంపించేటప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వేదిగా క్రిష్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహంలో ఐరా ఖాన్… తన ప్రేమికుడు నుపుర్ శిఖరే… కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. అయితే ఐరాను నుపుర్ కు ఇచ్చి పెళ్ళి చేసిన తరువాత… అమీర్ ఖాన్(Aamir Khan) భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు తుడుచుకుంటూ కనిపించారు. ఐరా-నుపుర్ ల పెళ్లిలో అమీర్ ఖాన్ కన్నీరు తుడుచుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఒక ప్రక్క కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూనే… అమీర్ ఖాన్ ను నెటిజన్లు ఓదార్చుతున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా గాని, ఒదిగి ఉండే నైజం అమీర్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Aamir Khan Comment
అమీర్ ఖాన్, రీనా దత్తాల గారాల పట్టి ఐరా ఖాన్… తన ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే ను గత కొంతకాలంగా ప్రేమించింది. కోవిడ్ సమయంలో ఐరాకు ఫిట్ నెస్ ట్రైనర్ గా పరిచయం అయిన నుపుర్… తమ ప్రేమను పెద్దలకు దృష్టికి తీసుకెళ్లి పెళ్లికి ఒప్పించారు. ఈ నెల 3వ తేదీన రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్న ఐరా-నుపుర్ ల జంట…. తాజాగా ఉదయ్ పూర్ లో క్రిష్ట్రియన్ సాంప్రదాయం ప్రకారం ఉంగరాలు మార్చుకుని పెళ్ళి చేసుకున్నారు. ఇరు వర్గాల కుటుంబ సభ్యలు, అతికొద్ది మంది సన్నిహితులు సమక్షంలో జరిగిన ఈ పెళ్ళి ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
Also Read : Hero Siddharth : వైరల్ అవుతున్న మల్టీ స్టారర్ సిద్ధార్థ్ పాట