బుచ్చిబాబు తీసిన ఉప్పెనతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు పంజా వైష్ణవ్ తేజ్. తదుపరి చిత్రం ప్రస్తుతం ఆది కేశవలో నటించాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కారణం లవ్లీ గర్ల్ శ్రీలీల కీలక పాత్రలో పోషిస్తుండడం. ఇప్పటికే మూవీకి సంబంధించిన పోస్టర్స్ హల్ చల్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా సినిమా గురించి అప్ డేట్ వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకోవడంతో మూవీ మేకర్స్ నవంబర్ 10న సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం బీసీసీఐ ఆధ్వర్యంలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కొనసాగుతోంది. యూత్ అంతా టీవీలకు, మొబైల్స్ కు అతుక్కు పోయారు.
కోట్లాది మందికి క్రికెట్ అంటే పంచ ప్రాణం. దీంతో ఆయా మ్యాచ్ లు ఉండడంతో జనం రారేమోనన్న ఉద్దేశంతో నిర్మాతలు ఆలోచించి ముందు జాగ్రత్తగా ఈనెల 10కి బదులు 24కు పోస్ట్ పోన్ చేసినట్లు టాక్. ఏది ఏమైనా క్రికెట్టా మజాకా అన్నది తేలి పోయింది. సినిమా రంగం కంటే క్రికెట్ ఎక్కువగా శాసిస్తోంది ఈ దేశాన్ని.
ఇక టాలీవుడ్ లో శ్రీలీల కు లక్కీ గర్ల్ అన్న పేరుంది. ఇప్పటికే తను నటించిన పెళ్లి సందడి, ధమాకా , భగవంత్ కేసరి సినిమాలు దుమ్ము రేపాయి. ఇప్పుడు ఆది కేశవ రిలీజ్ కు రెడీగా ఉంది. సంక్రాంతికి మహేష్ తో గుంటూరు కారం రానుంది.