Aa Okkati Adakku: ప్రముఖ నటుడు అల్లరి నరేశ్, జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలో అంకం మల్లి దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘ఆ ఒక్కటి అడక్కు’. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిశోర్, వైవా హర్ష కీలకపాత్రలు పోషించారు. అల్లరి నరేశ్ తండ్రి, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో గతంలో తెరకెక్కించిన ‘ఆ ఒక్కటి అడక్కు(Aa Okkati Adakku)’ టైటిల్ ను మరల ఉపయోగించి మే 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ ఆశించిన స్థాయిలో కమర్షియల్ హిట్ కాలేకపోయింది. కామెడీ పరంగా అలరించినా… అంతగా వసూళ్లు రాబట్టలేకపోయింది. దీనితో ఇప్పుడు ఈ సినిమా సైలంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.
Aa Okkati Adakku Movie OTT Updates
‘ఆ ఒక్కటి అడక్కు’ ఎలాండి హడావుడి లేకుండా శుక్రవారం నుండి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిపోతుంది. ప్రస్తుతం తెలుగులో అందుబాటులో ఉంది. వీకెండ్ టైమ్ పాస్ చేయాలనుకునే ప్రేక్షకులకు ఈ మూవీ ఎంటర్‌టైన్ చేస్తుంది. ఇలా ఉండగా అల్లరి నరేశ్ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ గత కొన్నేళ్ల నుంచి సీరియస్ సినిమాలు, స్టార్ హీరోల మూవీస్‌లో కీలక పాత్రలు పోషిస్తూ వచ్చాడు. మళ్లీ చాన్నాళ్ల తర్వాత తన బలమైన కామెడీ కథతో తీసిన ‘ఆ ఒక్కటి అడక్కు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పెళ్లి కానీ కుర్రాడిగా అల్లరి నరేశ్ నటించాడు.
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే వయసు పెరిగిన అబ్బాయి పెళ్లి కోసం పడే తంటాలను ఈ చిత్రంలో చూపించారు. పెళ్లి చేసుకోవడానికి హీరో పడే కష్టాలు, మాట్రిమొని సైట్స్ ను కలవడం… అందులో వారు చేసే మోసాలను కళ్లను కట్టినట్లుగా చూపించారు. ఇక ఇందులో మరోసారి తన నటనతో ఆకట్టుకుంది ఫరియా అబ్దుల్లా.
Also Read : Iswarya Menon: ‘బ్యూటిషియన్’ గా మారిన ‘స్పై’ బ్యూటీ !