బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో నటించింది టబు. ఎ సూటబుల్ బాయ్ వెబ్ సీరీస్ లో రెచ్చి పోయి నటించింది. ఇది గతంలో విడుదలైనా ఇప్పటికీ ఆదరిస్తున్నారు. ఇసాన్ ఖట్టర్ యువకుడు. ఇక 50 ఏళ్లు దాటిన మహిళ టబు. ఇద్దరూ పోటీ పడి నటించారు. ఇక రొమాన్స్ పండించారు. విక్రమ్ సేథ్ నవల ఎ సూటబుల్ బాయ్ ఆధారంగా మీరా నాయర్ షోలో టబు జీవించింది పాత్రలో.
దేశ విభజన తర్వాత నాలుగు కుటుంబాల కథాంశంతో రూపొందించారు ఈ సీరీస్ ను. ఇదిలా ఉండగా గతంలో టబు మీరా నాయర్ తో కలిసి ది నేమ్ సేక్ లో నటించింది. జుంపా లహరి నవల ఆధారంగా తీసిన ఈ మూవీ విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఇక తాజాగా సయిదా బాయి పాత్రలో టబు కనిపించింది.
ఎ సూటబుల్ బాయ్ వెబ్ సీరీస్ లో మాన్ కపూర్ గా ఇషాన్ కట్టర్, లతా మెహ్రాగా తాన్య మానిక్తలా, సవితా మెహ్రా కపూర్ గా రసిక దుగల్ , రూపా మెహ్రాగా మహిరా కక్కర్ , మహేష్ కపూర్ గా రామ్ కపూర్, ప్రాణ్ కపూర్ గా గగన్ దేవ్ రియర్ , అరుణ్ మెహ్రాగా వివాన్ షా, మీనాక్షి చటర్జీ మెహ్రాగా షహనా గోస్వామి , తదితరులు నటించారు ఇందులో. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో తెగ చూస్తున్నారు దీనిని.