Actor Ali : సినీ నటుడు, కమెడియన్ అలీ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఈ విషయం తెలుపుతూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి, ఆ పార్టీకి సపోర్ట్ చేసిన అలీకి.. వైసీపీ ప్రభుత్వం రీసెంట్గా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించింది. అయితే ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో.. అలీ ఈ నిర్ణయం తీసుకున్నారా? అనేది తెలియదు కానీ.. ప్రస్తుతం ఆయన వైసీపీకి కూడా రాజీనామా చేసి.. పూర్తి స్థాయిలో రాజకీయాలకు స్వస్తి పలికినట్లుగా ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.
Actor Ali Comment
ఈ వీడియోలో అలీ(Actor Ali) మాట్లాడుతూ.. నేను 1999లో డి. రామానాయుడుగారి కోరిక మేరకు రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఆర్టిస్ట్‌గా నాకు ఆయన ‘ప్రేమ ఖైదీ’ చిత్రంతో గుర్తింపునిచ్చారు. ఆయన అప్పుడు బాపట్ల ఎంపీగా నిలబడుతున్నానని చెప్పి.. నన్ను ప్రచారం చేయమని అడిగారు. ఆయన కోసం రాజకీయాల్లోకి వచ్చాను. తర్వాత వైసీపీలో చేరాను. నేను ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీ నాయకుడిని, నా సపోర్ట్ కోరిన వారి కోసమే మాట్లాడాను తప్ప.. ఎవరినీ పర్సనల్‌గా కించపరచలేదు, దూషించలేదు. కావాలంటే మీరు వెతుక్కోవచ్చు.
నాకు అన్నం పెట్టింది.. నన్ను ఇంత వాడిని చేసింది సినీ పరిశ్రమ, నిర్మాతలు, దర్శకులు, హీరోలు. 45 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాను. నాకు ఆ భగవంతుడు దయా గుణం ఇచ్చాడు. దీనికి రాజకీయ బలం తోడైతే .. ఇంకా ఎక్కువ సేవ చేయవచ్చనే రాజకీయాల్లో వచ్చాను తప్పితే.. రాజకీయం చేయాలని మాత్రం రాలేదు. మా నాన్నగారి పేరుతో 16 ఏళ్లుగా ఓ ట్రస్ట్ నడుపుతున్నాను. నా రెమ్యునరేషన్లో 20 శాతం ఆ ట్రస్ట్‌కే ఇస్తాను. విదేశాల్లో ఏవైనా ప్రోగ్రామ్స్ చేస్తే 60 శాతం ఆ ట్రస్ట్‌కి, 40 శాతం నేను తీసుకుంటాను. కరోనా టైమ్‌లో కూడా ఎందరికో సహాయం చేశాను.
Also Read : Vishwak Sen: తన ఇన్‌స్టా అకౌంట్ డిలీట్ చేసిన విశ్వక్ సేన్ ?