Hero Upendra : కన్నడ హీరో ఉపేంద్ర కు షాక్ ఇచ్చిన ఓ కుర్రాడు

యుఐ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చారు ఉపేంద్ర...

Hello Telugu - Hero Upendra

Hero Upendra : కన్నడ స్టార్ హీరో ఉపేంద్రకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్, డైరెక్టర్స్ సైతం ఉపేంద్రకు వీరాభిమానులు. ఎప్పుడూ విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. హీరోగానే కాకుండా దర్శకుడిగానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన ఉపేంద్ర(Hero Upendra).. ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో యుఐ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ డిసెంబర్ 20న థియేటర్లలో విడుదలైంది. కన్నడతోపాటు అన్ని భాషలలోనూ ఈ సినిమాను అడియన్స్ ముందుకు వచ్చారు. ఇప్పటివరకు ట్విట్టర్ వేదికాగ ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అంతకు ముందు టీజర్, ట్రైలర్ ద్వారా సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాడు ఉపేంద్ర. ప్రస్తుతం ఉపేంద్రకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Hero Upendra…

యుఐ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చారు ఉపేంద్ర(Hero Upendra). ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లో సందడి చేశారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో నిర్వహించగా.. ఓ మీడియా సమావేశంలో ఉపేంద్రకు షాకింగ్ సంఘటన ఎదురైంది. ఒక వ్యక్తి లేచి నిలబడి గాడ్ ఈజ్ గ్రేట్ అన్నారు. “మీరు పాతిక సంవత్సరాల క్రితం తీసిన ఏ సినిమాలోనే నేను ఇంకా ఉన్నాను. మీరు కాల్చి 90 మైనస్ 1 అంటారు కదా. ఆ సమయంలో ఫ్రేమ్ లో పరిగెత్తుకుంటూ వెళ్లే కుర్రాడు ఉంటాడు.

ఆ కుర్రాడిని నేనే” అంటూ చెప్పడంతో ఉపేంద్ర షాక్ అయ్యారు. కొంత సమయం వరకు ఏం మాట్లాడకుండానే అలాగే ఉండిపోయారు. ఆ తర్వాత అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఇప్పుడు మళ్లీ కనిపించావా అని ఉపేంద్ర అనడంతో అందరూ గట్టిగా నవ్వేశారు. పాతిక సంవత్సరాలుగా ఉపేంద్ర సినిమాను చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఉపేంద్ర సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. హీరోయిజం చూపించే సినిమాలు కాకుండా ప్రయోగాత్మక సినిమాలను రూపొందించడంలో ముందుంటారు ఉపేంద్ర. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండడంతో నెటిజన్స్ క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు.

Also Read : Mahesh Babu : ‘ముఫాసా’ సినిమాతో ఓ సరికొత్త రికార్డు క్రీట్ చేసిన మహేష్ ఫ్యాన్స్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com