Saif Ali Khan: ‘దేవర’ షూటింగ్ లో ప్రమాదం ! విలన్ సైఫ్ అలీఖాన్ కు గాయాలు ?

'దేవర' షూటింగ్ లో ప్రమాదం ! విలన్ సైఫ్ అలీఖాన్ కు గాయాలు ?

Hello Telugu - Saif Ali Khan

Saif Ali Khan: స్టైలిష్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరక్కిస్తున్న సినిమా ‘దేవర’. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించగా… ప్రతినాయకుని పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండు పార్టులుగా విడుదల చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి… మొదటి పార్టును ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనితో ‘దేవర’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Saif Ali Khan Accident in Shooting

అయితే హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుండగా విలన్ రోల్ లో నటిస్తున్న సైఫ్ అలీఖాన్ కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) మోకాలు, భుజానికి గాయాలయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ముంబైలోని కొకిలాబెన్ ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ‘దేవర’ షూటింగ్ లో ప్రమాదం అంటూ సోష‌ల్ మీడియాలో వార్తలు వైర‌ల్ అండంతో సైఫ్ అభిమానుల‌తో పాటు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆందోళ‌న‌ చెందుతున్నారు. అయితే ఈ ప్రమాదంపై ‘దేవర’ చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి స్పంద‌న రాలేదు. మరోవైపు సైఫ్‌ అలీఖాన్‌ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఫిషింగ్‌ హార్బర్‌ విలేజ్‌, పోర్ట్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న దేవర నుంచి అదిరిపోయే గ్లింప్స్‌ షేర్ చేయగా.. నెట్టింట మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డులు క్రియేట్‌ చేస్తూ హాట్‌ టాపిక్‌గా నిలిచింది.

Also Read : Comedian Dhanraj: హస్య నటుడు ధనరాజ్‌దర్శకత్వంలో ‘రామం రాఘవం’ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com