Comedian Dhanraj: హస్య నటుడు ధనరాజ్‌దర్శకత్వంలో ‘రామం రాఘవం’ !

హస్య నటుడు ధనరాజ్‌దర్శకత్వంలో ‘రామం రాఘవం’ !

Hello Telugu - Comedian Dhanraj

Comedian Dhanraj: ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మారిన వేణు టిల్లు (జబర్దస్త్ వేణు) ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించడంతో వేణు దర్శకత్వంలో నటించడానికి నేచురల్ స్టార్ నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనితో వేణు స్పూర్తితో తన స్నేహితుడు, ప్రముఖ హాస్య నటుడు ధనరాజ్‌ సైతం మెగాఫోన్ పట్టడానికి సిద్ధమయ్యారు. స్లేట్‌ పెన్సిల్‌ స్టోరీస్‌ పతాకంపై సముద్రఖనితో కలిసి నటిస్తున్నసినిమాకు ధనరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాకు ‘రామం రాఘవం’ అనే టైటిల్ ను ఖరారు చేయడంతో పాటు అయోధ్య రామ మందిరంలో బలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ‘రామం రాఘవం’ సినిమా టైటిల్ కమ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. తండ్రి కొడుకులుగా సముద్రఖని, ధనరాజ్ లను ఈ ఫస్ట్ లుక్ లో చూపించగా… ఈ సినిమా ఫస్ట్ లుక్ ను 22 మంది సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదల చేసారు. ప్రస్తుతం ‘రామం రాఘవం’ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Comedian Dhanraj Movie

స్లేట్‌ పెన్సిల్‌ స్టోరీస్‌ పతాకంపై పృథ్వీ పోలవరపు నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రభాకర్‌ ఆరిపాక సమర్పిస్తున్నారు. ‘‘సముద్రఖని, ధనరాజ్‌(Comedian Dhanraj) తండ్రీకొడుకులుగా నటిస్తున్న చిత్రమిది. ఆ బంధం నేపథ్యంలో ఇదివరకెప్పుడూ చూడని కథని ధనరాజ్‌ ఈ చిత్రంతో ఆవిష్కరిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తామని సినీ వర్గాలు తెలిపాయి. మోక్ష, హరీశ్‌ ఉత్తమన్‌, సత్య పృథ్వీ, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్‌ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి శివ ప్రసాద్‌ యానా కథను అందించగా… అరుణ్‌ చిలువేరు సంగీతం అందిస్తున్నారు.

Also Read : Saif Ali Khan: ‘దేవర’ షూటింగ్ లో ప్రమాదం ! విలన్ సైఫ్ అలీఖాన్ కు గాయాలు ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com