Dhruva Sarja: యావత్ ప్రపంచం ఎంతో ఆశక్తిగా ఎదురుచూసిన అయోధ్య రామమందిరంలోని బలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. ఈ అపురూప ఘట్టం కోసం ఎంతో మంది ఎదురుచూసారు. అదే ముహూర్తంలో తమ పిల్లలకు పేర్లు పెట్టడానికి చాలా రోజుల నుండి ఎదురుచూసారు. వారిలో సెలబ్రెటీలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో శాండల్‌వుడ్ స్టార్ హీరో ధ్రువ సర్జా కూడా తన పిల్లలకు బలరాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తానికే నామకరణం చేసాడు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయితే అర్జున్ కు ధ్రువ సర్జా స్వయానా మేనల్లుడు. ధ్రువ సర్జా- ప్రేరణ దంపతులకు ఇద్దరు పిల్లలు. 2022లో ధ్రువ దంపతులకు ఆడ బిడ్డ జన్మించగా… 2023లో మగబిడ్డ పుట్టాడు.
Dhruva Sarja Viral
అయితే స్వతహాగా హనుమంతుడి భక్తుడైన ధ్రువ సర్జా(Dhruva Sarja)… తమ పిల్లలకు నామ కరణం చేయడానికి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం వరకు వేచిచూసాడు. ఈ నేపథ్యంలో అయోధ్యలో బలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన 12.20 గంటలకు తమ పిల్లలకు నామ కరణం చేసాడు. తన కూతురికి రుద్రాక్షి, కుమారుడికి హయగ్రీవ అని నామకరణం చేశారు. ఈ నామకరణ కార్యక్రమానికి అర్జున్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా హజరయ్యారు.
అయోధ్యలో రాముడిని ప్రతిష్టాపన చేసిన రోజున రోజున నా పిల్లలకు పేర్లు పెట్టాలని ఇన్నిరోజులు వేచి చూసానని ధ్రువ సర్జా తెలిపారు. వాయుపుత్ర హనుమంతుడు మహిరావణుడిని సంహరించడానికి పంచముఖి ఆంజనేయస్వామిగా అవతరించాడు. పంచముఖి అంటే ఐదు ముఖాలు. ఇందులో హనుమంతుని ముఖంతో సహా నరసింహ, వరాహ, హయగ్రీవ, గరుడతో సహా ఐదు ముఖాలు ఉన్నాయి. అందులో నుంచి హయగ్రీవ అనే పేరును తన కుమారుడికి పెట్టుకున్నట్లు ధ్రువ సర్జా తెలిపారు. సంజయ్ దత్ శివ భక్తుడు కావడంతో… తన కూతురికి రుద్రాక్షి అని పేరు పెట్టడంతో సంతోషించాని తెలిపారు. త్వరలో కుటుంబ సమేతంగా అయోధ్యకు వెళతామని ధ్రువ చెప్పాడు.
Also Read : Prabhas NTR : రాముని ప్రాణ ప్రతిష్ట కు రాలేకపోయిన ప్రభాస్, ఎన్టీఆర్.. కారణాలు ఇవే..