Porn Star Shakeela: దక్షిణాది భాషల్లో ప్రముఖ శృంగార తారగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన షకీలాకు చేదు అనుభవం ఎదురైంది. తన పెంపుడు కుమార్తె శీతల్ ఊహించని విధంగా ఆమెపై దాడి చేసింది. దీనితో కుటుంబ వ్యవహారాల విషయంలో తలెత్తిన మనస్పర్ధల కారణంగా పెంపుడు కుమార్తె శీతల్ తనపై దాడి చేసిందంటూ… షకీలా చెన్నై పోలీసులను ఆశ్రయించింది. తన న్యాయవాది సమక్షంలోనే శీతల్.. తనపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు శీతల్ కూడా షకీలాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో ఇరువురి ఫిర్యాదులు స్వీకరించిన చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవి ఫుటేజ్ ల ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు.
Porn Star Shakeela Viral
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో శృంగార తారగా గుర్తింపు పొందిన షకీలా… స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ ను సంపాదించుకుంది అంటే అతిశయోక్తి కాదు. సిల్క్ స్మిత తరువాత అంతటి క్రేజ్ తెచ్చుకున్న షకీలా(Shakeela) సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టంగా మారేది. వ్యక్తిగత కారణాలతో పెళ్ళికి దూరంగా ఉన్న షకీలా… ఆమె అన్న కుమార్తె శీతల్ ను పెంచుకుంటున్నట్లు గతంలో ప్రకటించింది. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన షకీలా… ఇటీవల బిగ్ బాస్ తెలుగు లో పాల్గొని మరోసారి ప్రేక్షకులను మెప్పించారు. కొన్ని వారాల తరువాత బిగ్ బాస్ నుండి బయటకు వచ్చి… తిరిగి చెన్నై వెళ్లిపోయిన షకీలా… తన పెంపుడు కుమార్తె శీతల్ తో విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో శీతల్ ఇంటి నుండి వెళ్ళిపోయినట్లు సమాచారం. ఈ నెల 20న తిరిగి షకీలా ఇంటికి వచ్చిన శీతల్… న్యాయవాది సమక్షంలో విచక్షణా రహితంగా దాడి చేసినట్లు షకీలా ఆరోపిస్తుంది.
Also Read : HanuMan Free Tickets : వన్ ప్లస్ వన్ బంపర్ ఆఫర్ అంటున్న చిత్ర బృందం