Salman Khan Tiger 3: యాష్ రాజ్ బ్యానర్‌పై మనీష్ శర్మ దర్శకత్వంతో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందిన తాజా స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘టైగర్3’. ఇమ్రాన్ హష్మీ, కత్రినా కైఫ్, అశుతోష్ రాణా, అనుప్రియా గోయెంకా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ముఖ్యంగా సల్మాన్ అభిమానులతో పాటు, యాక్షన్ ప్రియులను అలరించింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ‘టైగర్3’ వివిధ దేశాల్లో రికార్డు స్థాయి వ్యూస్ ను దక్కించుకుని ఓటీటీలో దూసుకుపోతుంది. భారత్ తో పాటు, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూఏఈ, సింగపూర్, మలేషియా, ఒమన్, ఖతార్ తదితర దేశాల్లో ఎక్కువ మంది వీక్షిస్తున్న టాప్-10 ఓటీటీ సినిమాల్లో ‘టైగర్3’ ఒకటిగా నిలిచింది.
Salman Khan Tiger 3 Trending
యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఈ చిత్రంలో సల్మాన్(Salman Khan) తన యాక్షన్‌తో అదరగొట్టారు. షారుక్ ఖాన్ కూడా అతిథి పాత్రలో మెరిశారు. ఇద్దరూ కలిసి నటించిన యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో త్వరలో తెరకెక్కబోతున్న ‘టైగర్ వర్సెస్ పఠాన్’ కోసం సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సల్మాన్-షారుక్ కాంబోలో వస్తున్న ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా… వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
Also Read : Upasana and Lavanya: సంక్రాంతి సంబరాలపై మెగా కోడళ్ళ ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ !