Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor). తల్లి శ్రీదేవి నుండి వారసత్వంగా వచ్చిన అందం, అభినయంతో బాలీవుడ్ లో సుస్థిత స్థానం సంపాదించుకున్న జాన్వీ కపూర్… తన సోదరి ఖుషీ కపూర్ తో కలిసి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షోకు హజరై సందడి చేసింది. ఈ సందర్భంగా కరణ్ జోహార్ అడిగిన కొన్ని ప్రశ్నలకు జాన్వీ కపూర్ చెప్పిన సమాధానాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా డేటింగ్ విషయంలో జాన్వీ చేసిన వ్యాఖ్యలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Janhvi Kapoor Viral
‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 8 లో పాల్గొన్న జాన్వీ కపూర్ ను… ‘ఎప్పుడైనా రొమాంటిక్ మెసేజ్‌లు వచ్చాయా?’ అని కరణ్ అడగ్గా… ‘దీనికి సమాధానం చెబితే ఖుషీ నన్ను ఏడిపిస్తుంది’ అంటూ చాలా సర్కాస్టిక్ గా సమాధానం చెప్పింది. వెంటనే ఎవరితో డేటింగ్ చేస్తారు ? అని కరణ్ ప్రశ్నించగా… ‘సినిమా వాళ్లతో మాత్రం అస్సలు డేటింట్ చేయను. డేటింగ్ చేసేవాళ్లకు నేనే ప్రపంచమై ఉండాలి. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలి. సినీ రంగంలో చాలా ఒత్తిడి ఉంటుంది. ఒకే వృత్తిలో ఉండేవాళ్లు దాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టం’ అని తన మనసులో ఉన్న భావాన్ని వెల్లడించారు. దీనితో జాన్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం జాన్వీ కపూర్… తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిస్తున్న ‘దేవర’లో నటిస్తున్నారు.
Also Read : Singer Sunitha : సినిమా చూసి ఎమోషనల్ అయిన సింగర్ సునీత