Game Changer: శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాతగా రామ్‌చరణ్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, సునీల్ కీలక పాత్రలు పోషించగా… ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. దీనితో ఈ సినిమా విడుదల కోసం మెగా ఫ్యామిలీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సలార్’ సినిమా చూడటానికి వచ్చిన నిర్మాత దిల్ రాజు ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌పై స్పందించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.
Game Changer Updates
‘సలార్’ సినిమా చూడటం కోసం హైదరాబాద్ లోని ఓ థియేటర్‌కు వచ్చిన ఆయన్ని పలువురు అభిమానులు ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఎప్పుడు అని ప్రశ్నించగా.. ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిపై కొంతమంది మెగా ఫ్యామిలీ అభిమానులు ఆనందం వ్యక్తం చేయగా… మరికొందరు మాత్రం ఇంకా పది నెలలు వెయిట్ చేయాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన ఎన్టీఆర్… దేవర సినిమాతో ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. విచిత్రం ఏమిటంటే… కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న దేవర సినిమా కంటే…. శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్(Game Changer)’ సినిమాను రామ్ చరణ్ ముందే ప్రారంభించాడు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయి ముందు దేవర రిలీజవుతుండగా… ఆ తరువాత ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అవుతోంది.
ప్రముఖ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ అందించిన పొలిటికల్, యాక్షన్ కథగా ‘గేమ్ ఛేంజర్’ తెరకెక్కిస్తున్నారు ప్రముఖ దర్శకుడు శంకర్. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషించగా… ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read : Tripti Dimri: రష్మికను ఆకాశానికి ఎత్తేస్తున్న త్రిప్తి