Dil Raju: టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. డిస్ట్రీబ్యూటర్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వి. వెంకట రమణా రెడ్డి… వివి వినాయక్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కించిన దిల్ సినిమాకు నిర్మాతగా వ్యవహించారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో దిల్ రాజుగా టాలీవుడ్ లో గుర్తింపు పొందరు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన దిల్ రాజు… కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించడంలో ముందుంటారు.
ఎప్పుడూ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ ఉండే దిల్ రాజుకు సంబంధించి ఓ కొత్త విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అక్కినేని నాగచైతన్య హీరోగా పరిచయం అయిన జోష్ సినిమాలో నిర్మాత దిల్ రాజు ఓ పాటను పాడినట్లు తాజాగా ఆ సినిమా దర్శకుడు వాసు వర్మ బయటపెట్టారు. దీనితో దిల్ రాజులో(Dil Raju) సింగింగ్ టాలెంట్ కూడా ఉందా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Dil Raju – నాగచైతన్య నటించిన జోష్ సినిమాలో పాట పాడిన దిల్ రాజు
వాసువర్మ దర్శకత్వంలో అక్కినేని నట వారసుడు నాగచైతన్య కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘జోష్’. యువతను ఆకట్టుకునే కథా, కథనాలతో తీర్చిదిద్దిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ‘జోష్’ సినిమాను మొదట రామ్‌చరణ్ తో తీయాలనుకున్నప్పటికీ ఎందుకో కుదరలేదు. ఇంతలోగా ఈ కథను నాగార్జున వినడం, అది బాగా నచ్చడంతో తన కుమారుడు నాగచైతన్యను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేసారు. నాగార్జునతో నిన్నే పెళ్ళాడతా, సూపర్ వంటి హిట్ సినిమాలకు సంగీతం అందించిన సందీప్ చౌతా.. ఈ సినిమాకు అందించిన పాటలు యువతను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో ఓ పాటను దిల్‌రాజు పాడినట్లు చిత్ర దర్శకుడు వాసు వర్మ ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు.
‘అన్నయొచ్చినాడో.. వెలుగులు వెన్నెల్ తెచ్చినాడో..’ అంటూ చంద్రబోస్ సాహిత్యం అందించిన పాటను దిల్‌రాజు స్వయంగా పాడినట్లు దర్శకుడు వాసు వర్మ తెలిపారు. ఈ పాట లిరిక్స్ వచ్చిన తర్వాత అవి సరిగా ఉన్నయో లేదో చూసుకుంటూ దిల్ రాజు హమ్ చేస్తుండటంతో అది విన్న దర్శకుడు వాసువర్మ పట్టుబట్టి మరీ ఆయనతోనే ఈ పాట పాడించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని గతంలో ప్రసారమైన రాఘవేంద్రరావు ‘సౌందర్య లహరి’లో దిల్‌రాజు స్వయంగా పంచుకున్నప్పటికీ.
Also Read : Keerthi Suresh: ‘అక్క’ గా వస్తున్న ‘మహానటి’