Hero Varun Tej: ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ కు డేట్ ఫిక్స్

‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ కు డేట్ ఫిక్స్

Hello Telugu - Varun Tej

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ హీరోగా ప్రముఖ యాడ్ ఫిల్మ్‌ మేకర్‌, సినిమాటోగ్రఫర్‌, వీఎఫ్‌ఎక్స్‌ స్పెషలిస్ట్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా తెరకెక్కించిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ బై లింగ్యువల్ ప్రాజెక్ట్ లో వరుణ్‌ తేజ్‌ ఫైటర్‌ పైలట్‌గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌గా కనిపించనుంది. ‘నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ పొంది భారత వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను తెరపై ఆవిష్కరించే విధంగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు గతంలో చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ను డిసెంబరు 8న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసినప్పటికీ అనివార్య కారణాల వలన వాయిదా వేసారు.

Varun Tej – ఫిబ్రవరి 16న వస్తున్న ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’

పెళ్లైన వెంటనే హానీమూన్ కు వెళ్ళకుండా… ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమంలో హీరో వరుణ్ తేజ్(Varun Tej) పాల్గొనడంతో ముందుగా ప్రకటించినట్లు ఈసినిమా డిసెంబరు 8న విడుదల అవుతుందని అందరూ భావించారు. అయితే అనివార్యకారణాల వలన చిత్ర యూనిట్ ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేయాల్సి వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాను ఫిబ్రవరి 16న తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే టీజర్‌ని కూడా విడుదల చేయనున్నట్లు స్పష్టత ఇచ్చారు. దీనితో ఫిబ్రవరి 16న థియేటర్లలో కలుసుకుందాం అంటూ హీరో వరుణ్ తేజ్ ను ఉద్దేశ్యించి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

వరుణ్ నెక్ష్ట్ ప్రాజెక్టు ‘మట్కా’

మరోవైపు పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా మట్కా (Matka)లో కూడా వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. మట్కా చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వరుణ్ తేజ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ బ్యాక్‌ డ్రాప్ స్టోరీతో రాబోతుంది.

Also Read : Chiranjeevi-KCR: కేసీఆర్‌ని పరామర్శించిన మెగాస్టార్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com