The Family Man 3: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన స్పై, యాక్షన్, థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ ’ వెబ్ సిరీస్ ఒకటి. మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నిర్మించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సూపర్ హిట్ కావడంతో… దానికి సీక్వెల్ గా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ తెరకెక్కించారు. ఈ సిరీస్ లో ల్.టి.టి.ఈ టెర్రరిస్ట్ రాజలెక్ష్మి చంద్రన్ (రాజి) పాత్రలో టాలీవుడ్ బ్యూటీ సమంత(Samantha) నటించడంతో మరింత హైప్ వచ్చింది. ఆ హైప్ కు తగ్గట్టుగానే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సూపర్ హిట్ గా నిలిచి చాలా నెలల పాటు టాప్ 10 జాబితాలో నిలిచింది. దీనితో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ ఎప్పుడు పట్టాలెక్కనుందనే విషయంపై మనోజ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
The Family Man 3 – ఫిబ్రవరి నుండి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ షూటింగ్
ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మనోజ్ బాజ్ పాయ్ మాట్లాడుతూ… ‘ఫిబ్రవరి నెలాఖరు నుంచి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ షూటింగ్ ప్రారంభించబోతున్నాం. ఈ సారి ఎక్కువ శాతం ఈశాన్య భారతదేశంలో షూట్ చేయనున్నాం. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ఎక్కడైతే పూర్తైందో అక్కడి నుంచే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ మొదలు కానుంది. అలాగే, గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించాలనుకుంటున్నాం అన్నారు. అంతేకాదు శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్‌పాయ్) పిల్లలు పెద్దవాళ్లు అవుతారు… ఆయనకూ కాస్త వయసు పెరుగుతుంది. కానీ, సవాళ్లు మాత్రం ఆయన్ని వెంటాడుతూనే ఉంటాయి’’ అంటూ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ గురించి మనోజ్ బాజ్ పాయ్ తెలిపారు.
Also Read : Bollywood Heros: బాలీవుడ్ హీరోలకు కేంద్రం నోటీసులు