Hero Jr NTR : కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘దేవర’ షూటింగ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న ఎన్టీఆర్… తరువాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్-2’ లో నటించబోతున్నారు. జనవరి నుండి ‘వార్-2’ షూటింగ్ లో తారక్ పాల్గొననున్నట్లు ఇప్పటికే ఆ చిత్ర యూనిట్ ప్రకటించింది. రెండు పార్టులుగా విడుదల కాబోయే ‘దేవర’తో పాటు ‘వార్-2’ తో బిజీ బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ తరువాత సినిమాను కూడా ప్రకటించారు.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘కేజీఎఫ్’ సిరీస్ కు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన ‘సలార్ పార్ట్ 1: ది సీజ్ ఫైర్’ ప్రమోషన్ లో ఉన్న దర్శకుడు ప్రశాంత్ నీల్… ఎన్టీఆర్ సినిమా గురించిన పలు ఆశక్తికరమైన విషయాలను వెల్లడించారు.
Hero Jr NTR – భిన్నమైన భావోద్వేగాలతో కూడిన వైవిధ్యబరితమైన పాత్రలో ఎన్టీఆర్ !
‘కేజీఎఫ్’ సిరీస్ తరువాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మరో సిరీస్ ‘సలార్’. ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ తో ప్రశాంత్ నీల్ అంటే కేరాఫ్ యాక్షన్ మూవీస్ అనే విధంగా మారింది. దీనితో దర్శకుడు ప్రశాంత్ నీల్… ఎన్టీఆర్(Jr NTR) తో చేయబోయే సినిమాలో యాక్షన్ కంటే భిన్నమైన భావోద్వేగాలతో కూడిన వైవిధ్యభరితమైన పాత్రను రూపొందించనట్లు తెలిపారు.
నా సినిమా అనే సరికి చాలా మంది యాక్షన్ సినిమాలా భావిస్తారు. అయితే ఎన్టీఆర్ పండించగల భిన్నమైన భావోద్వేకాలతో కూడిన చాలా కొత్త కథ అని… వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్తున్నట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పష్టం చేసారు. తన జానర్ కు భిన్నంగా ఎన్టీఆర్ సినిమా అంటూ ప్రశాంత్ నీల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1: ది సీజ్ ఫైర్’ పేరుతో ఈ నెల 22న విడుదల చేస్తున్నారు.
Also Read : Vijayasanthi: మళ్ళీ మేకప్ వేసుకోనున్న ‘రాములమ్మ’