Hero Nani: వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కించిన సినిమా ‘హాయ్ నాన్న’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబరు 7 విడుదల చేస్తున్న ఈ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించారు.
అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ కలిసి స్విమ్మింగ్ ఫూల్ లో సేదతీరుతూ ఉన్న ఓ పర్సనల్ ఫోటోను వేదికపై ప్రదర్శించడంపై చిత్ర యూనిట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. తమ సినిమా ప్రమోషన్ కోసం… విజయ్-రష్మికల పర్సనల్ విషయాలను వేదికపై ప్రదర్శిస్తారా అంటూ ఈవెంట్ మేనేజ్ మెంట్ తో పాటు చిత్ర యూనిట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఈ వివాదంపై హీరో నాని స్పందించారు.
Hero Nani Says Sorry
‘హాయ్ నాన్న’ సినిమా ప్రమోషన్ లో భాగంగా వివిధ ఛానెల్స్ కు ఇంటర్వూలు ఇస్తున్న హీరో నాని(Hero Nani)… తాజాగా ఈ వివాదంపై స్పందించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్-రష్మిక పర్సనల్ ఫోటోలు వేదికపై ప్రదర్శించడం నిజంగా దురదృష్ణకరం. ఈ ఫోటోలు చూసి మేము కూడా షాక్ కు గురయ్యాము. కాని మేమంతా (విజయ్, రష్మిక, నాని, మృణాల్) మంచి స్నేహితులం.
సినిమా ప్రమోషన్స్ లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని వారికి కూడా తెలుసు. అయినప్పటికీ ఈ చర్య వలన ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే నాతో పాటు ‘హాయ్ నాన్న’ చిత్ర యూనిట్ నుండి క్షమాపణలు చెప్తున్నా అని నాని అన్నారు. దీనితో ఈ వివాదానికి తెర దించినట్లే అని చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ… దీనికి విజయ్-రష్మికలతో పాటు వారి అభిమానుల నుండి ఎంతమేర ఆమోదం లభిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
Also Read : Dinesh Phadnis: విషమంగా బాలీవుడ్ సీనియర్ నటుడి ఆరోగ్యం