Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన సోదరుడు, మరో ప్రముఖ నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ‘రౌడీబాయ్స్’ సినిమాతో టాలీవుడ్ లో ప్రవేశించిన ఆశిష్ రెడ్డి… ప్రస్తుతం రెండో సినిమా ‘సెల్ఫిష్’ తో ఉగాదికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Dil Raju Family Function
ఈ గ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన అద్విత రెడ్డి అనే అమ్మాయితో ఆయనకు వివాహం కుదిరింది. దీనితో నిర్మాత దిల్ రాజు(Dil Raju) ఇంట్లో గురువారం వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథులు హాజరై ఈ నిశ్చితార్ధ వేడుకలో సందడి చేశారు. ప్రస్తుతం వీరి నిశ్చితార్ధం వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అద్విత రెడ్డి తండ్రి వ్యాపారవేత్త అని సమాచారం. వివాహాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
‘సెల్ఫిష్’ తో బిజీగా ఉన్న ఆశిష్ రెడ్డి
‘రౌడీబాయ్స్’ సినిమాతో గత ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆశిష్… ఆశించిన విజయం అందుకోలేకపోయారు. దీనితో కాస్తా గ్యాప్ ఇచ్చిన ఆశీష్…. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. విశాల్ కాశీ దర్శకత్వంలో నటిస్తున్న ‘సెల్ఫిష్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ‘లవ్‌టుడే’ ఫేమ్ ఇవానా హీరోయిన్‌గా సందడి చేయనుంది. ఆశిష్ హీరోగా ఇటీవల మరో సినిమా పట్టాలెక్కింది.
Also Read : Nayanatara: నయనతారకు భర్త విఘ్నేశ్ సర్ ప్రైజ్ గిఫ్ట్