Naga Chaitanya : ఏం మాయ చేసావే, 100% లవ్, మజిలి, మనం, ప్రేమమ్, లవ్ స్టోరీ వంటి వైవిధ్యమైన కథలతో వెండితెర ప్రేక్షకులను అలరించిన అక్కినేని వారసుడు నాగ చైతన్య… ఓటీటీలో అడుగుపెట్టారు. విక్రమ్ కుమార్ కే దర్శకత్వంలో తెరకెక్కించిన ‘దూత’ అనే వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వేదికగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబరు 1 నుండి స్ట్రీమింగ్ కాబోయే ఈ ‘దూత’ వెబ్ సిరీస్ కు సంబందించిన ట్రైలర్ ను నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసారు.
Naga Chaitanya – ‘దూత’ జర్నలిస్టు పాత్రలో నాగ చైతన్య
అక్కినేని నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘దూత’ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ను బట్టి చూస్తే మర్డర్ మిస్టరీ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. లెక్కపెట్టలేనన్ని వాస్తవాలు, చెప్పలేని రహస్యాలు వాటిని కనుగొనేందుకు ఓ వ్యక్తి చేసిన పోరాటం ఇది’ అంటూ జర్నలిస్టు సాగర్ పాత్రలో నాగ చైతన్య(Naga Chaitanya)…. ఈ ట్రైలర్ ద్వారా సిరీస్ గురించి క్లుప్తంగా వివరించారు. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ వెబ్ సిరీస్ ను తప్పక చూడాల్సిందే అన్నట్టుగా ఈ ట్రైలర్ ను తీర్చిదిద్ధారు.
విక్రమ్ కుమార్ తో నాగ చైతన్య
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య గతంలో రెండు సినిమాల్లో నటించారు. ఒకటి మనం, రెండోది థ్యాంక్యూ. అయితే అక్కినేని ఫ్యామిలీలోని దాదాపు అందరూ భాగస్వామ్యం అయిన మనం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిపోగా… థ్యాంక్యూ మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. అయితే మొదటి సారిగా విక్రమ్ కుమార్ కె, నాగ చైతన్య కాంబోలో ‘దూత’ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు.
Also Read : Big Boss Vichithra: తెలుగు అగ్రహీరోపై లైంగిక వేధింపుల ఆరోపణలు ?