Oppenheimer : అణుబాంబు సృష్టికర్త డా జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన హాలీవుడ్ సినిమా ‘ఓపెన్‌హైమర్’. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ ఏడాది జూలై 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హాలీవుడ్ రీసెంట్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. కేవలం 100 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 950 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దినప్పటికీ భగవద్గీతకు సంబంధించి ఓ సన్నివేశం వివాదాస్పదంగా మారింది. సినిమాలోని ఓ శృంగార సన్నివేశంలో భగవద్గీతను చూపించడాన్ని కొంతమంది సినీప్రియులు తప్పుబట్టడంతో పాటు ఆ సీన్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.
Oppenheimer – అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘ఓపెన్‌హైమర్’
టైటానిక్, అవతార్ సినిమాల వంటి బ్లాక్ బస్టర్ క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ ‘ఓపెన్‌హైమర్(Oppenheimer)’ సినిమా కోసం ఓటీటీ రిలీజ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వేచిచూస్తున్నారు. దీనితో ఎట్టకేలకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. అయితే అమెజాన్ ప్రైమ్ మాత్రం దీనిని ప్రస్తుతానికి రెంట్ విభాగంలో అందుబాటులో ఉంచింది. ఈ సినిమా చూడాలంటే 149 రూపాయలు రెంట్ చెల్లించాల్సిందే అంటూ అమెజాన్ ప్రైమ్ వీడియో పోస్ట్ పెట్టింది.
Also Read : Mansoor Ali Khan: త్రిషకు సారీ చెప్పేది లేదంటున్న మన్సూర్ అలీఖాన్