NTR: హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ‘దేవర’

హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ‘దేవర’

Hellotelugu-NTR Devara

హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ‘దేవర’

NTR : స్టైలిష్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దేవర’. సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. రెండు పార్టులుగా విడుదల చేస్తున్న ఈ సినిమాను 2024 ఏప్రిల్ లో మొదటి పార్టును ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే దేశ, విదేశాల్లో దాదాపు 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ దీపావళి సందర్భంగా ఓ చిన్న విరామం తీసుకుంది.

NTR – ఫెస్టివ్ బ్రేక్ తరువాత ‘దేవర’ షూటింగ్ షురూ

దీపావళి సందర్భంగా ఫెస్టివ్ బ్రేక్ తీసుకున్న చిత్ర యూనిట్ మంగళవారం నుండి మరల షూటింగ్ ను షురూ చేసింది. ‘దేవర’ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాల్ని హైదరాబాద్‌ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌(NTR), జాన్వీతోపాటు ఇతర ప్రధాన తారాగణంపై ఇటీవలే గోవాలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మించిన ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరణని జరుపుతున్నారు. సముద్రతీరం నేపథ్యంలో… భయం అనే అంశం ప్రధానంగా సాగే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు షైన్ టామ్‌ చాకో విలన్స్ గా కనిపించబోతున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్.

Also Read : Atlee: విజయ్-షారూక్ భారీ మల్టీ స్టారర్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com