Tiger 3 Movie : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ నటించిన టైగర్ 3 దుమ్ము రేపుతోంది. విడుదల కంటే ముందు అడ్వాన్స్ బుకింగ్ కు భారీ ఆదరణ లభించింది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి రోజు ఏకంగా రూ.19 కోట్లు వసూలు చేసింది. గతంలో వచ్చిన సినిమాల కంటే ఎక్కువగా ముందస్తు ద్వారానే డబ్బులు వసూలు చేయడం విశేషం.
Tiger 3 Movie Updates
టైగర్ 3(Tiger 3) ముందస్తు అమ్మకాలలో భాగంగా భారీగా టికెట్లను విక్రయించింది. ఇప్పటికే 2 లక్షల 43 వేలకు పైగా టికెట్లు అమ్ముడు పోయినట్లు టాక్. మల్టీ ప్లెక్స్ లలో ఎక్కువగా ఉన్నాయి. లక్షా 3 వేల టికెట్లు సోమవారం కోసం విక్రయించారు.
ఇక చిత్రం విషయానికి వస్తే ప్రారంభం రోజు భారీగా వసూలు చేస్తే ఇందులో ఎక్కువగా హిందీ వెర్షన్ నుండి రావడం విశేషం. రూ. 18 కోట్లు రాగా , తమిళం, తెలుగు నుంచి రూ. 80 లక్షలు వచ్చినట్లు ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్ష్ వెల్లడించారు.
టైగర్ 3 మూవీ మూడోది. గతంలో 2012లో తొలిసారి ఏక్ థా టైగర్ తో వచ్చింది. సల్మాన్, కత్రీనా టైగర్ , జోయాగా నటించారు. టైగర్ జిందా హై చిత్రం 2017లో వచ్చింది. 2023లో మూడో సినిమా సీక్వెల్ గా వస్తోంది.
Also Read : Rekha Viral : నెట్టింట్లో రేఖ వైరల్