Ala Ninnu Cheri : కొన్ని సినిమాలు మనల్ని కదిలించేలా చేస్తాయి. అలా చేయాలని ప్రతి దర్శకుడు ఆరాట పడతాడు. ఎవరూ అనుకోలేదు కమెడియన్ వేణులో ఇంత టాలెంట్ ఉందని. అది బలగం(Balagam) పేరుతో వస్తుందని. కొన్ని అద్భుతాలు అలా జరిగి పోతాయని అనుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు టాలీవుడ్ లో తమను తాము ప్రూవ్ చేసుకోవాలని ఆరాట పడే దర్శకుల సంఖ్య పెరుగుతోంది. ఇది మంచి పరిణామం అని చెప్పక తప్పదు.
Ala Ninnu Cheri Viral
ఇప్పటికే టాలీవుడ్ లో ప్రేమ ప్రధానంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. అలాంటి కోవకు వచ్చిన మూవీనే అలా నిన్ను చేరి చిత్రం. ఈ మూవీలో ముగ్గురు కీలక పాత్ర పోషించారు. అందాల ముద్దుగుమ్మలు హెబ్బా పటేల్ , పాయల్ తో పాటు దినేష్ తేజ్ నటించారు. అలా నిన్ను చేరి చిత్రానికి నూతన దర్శకుడు మారేష్ శివన్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రానికి సుధాకర్ నిర్మాతగా వ్యవహరించారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందించారు. ప్రేమ ప్రధానంగా సాగుతుంది ఈ చిత్రం. ఇందులో మరో కీలక పాత్రలో ఝాన్సీ కూడా నటించడం విశేషం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రేమ కథా మూవీ అని చెప్పక తప్పదు.
Also Read : Inaya Sultana : రూట్ మార్చిన సుల్తానా