Rajinikanth : త‌లైవా రెమ్యూన‌రేష‌న్ సెన్సేష‌న్

ఏకంగా రూ. 280 కోట్లంటూ తెగ ప్ర‌చారం

Hellotelugu-Rajinikanth

Rajinikanth : భార‌తీయ సినీ జ‌గ‌త్తులో ప‌వ‌ర్ ఫుల్ హీరోల‌లో ఒక‌డు త‌లైవా ర‌జ‌నీకాంత్. త‌నకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జైల‌ర్ రికార్డుల మోత మోగించింది. ప్ర‌త్యేకించి కొంత సైలెంట్ గా ఉన్న ర‌జ‌నీకాంత్ కు ఉన్న‌ట్టుండి బిగ్ స‌క్సెస్ గ‌ట్టెక్కించేలా చేసింది.

Rajinikanth Remunaration

దీంతో స‌న్ పిక్చ‌ర్స్ ఏకంగా ఊహించ‌ని రీతిలో వ‌చ్చిన ఆదాయంలోంచి రూ. 200 కోట్లు రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌డంతో ఒక్క‌సారిగా విస్తు పోయారు. ఇక ర‌జ‌నీకాంత్(Rajinikanth) తో పాటు ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్. త‌ను న‌టించిన లియో మూవీకి ఏకంగా రూ. 90 కోట్ల‌కు పైగానే తీసుకున్న‌ట్లు టాక్.

తాజాగా మ‌రో సంచ‌ల‌న వార్త నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. త‌న సినీ కెరీర్ లో 171వ ఫిల్మ్ కు ఓకే చెప్పాడు ర‌జనీకాంత్. దీనిని తెర కెక్కించే ప్ర‌య‌త్నం లో మునిగి పోయాడు లోకేష్ క‌న‌గ‌రాజ్. మ‌నోడు విజ‌య్ తో ఇటీవ‌లే లియో తీశాడు. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. త‌న‌కు ద‌ళ‌పతితో ఇది రెండో మూవీ. అంత‌కు ముందు మాళ‌వికా మోహ‌న్ తో మాస్ట‌ర్ తీశాడు. ఇది కూడా బిగ్ స‌క్సెస్ .

ఇక లియో డివైడ్ టాక్ వ‌చ్చినా వ‌ర‌ల్డ్ వైడ్ గా క‌లెక్ష‌న్ల ప‌రంగా రికార్డుల మోత మోగించింది. ఇదిలా ఉండ‌గా ద‌ర్శ‌కుడి కంటే ఎక్కువ‌గా ర‌జ‌నీకాంత్ కు ఏకంగా రూ. 280 కోట్ల రెమ్యూన‌రేష‌న్ ఇచ్చేందుకు రెడీ అయిన‌ట్లు టాక్. ఒక ర‌కంగా ఇదే గ‌నుక నిజ‌మైతే ఆసియా ఖండంలో జాకీ చాన్ త‌ర్వాత అత్య‌ధిక పారితోష‌కం అందుకున్న న‌టుడిగా త‌లైవా చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయం.

Also Read : Director Shankar : శంక‌ర్ మూవీస్ పై ఉత్కంఠ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com