శివపుత్రుడి సీక్వెల్ తంగలాన్ ?
Thangalaan : విభిన్న పాత్రలతో విలక్షణ నటుడిగా ఎన్నో జాతీయ అవార్డులు సంపాదించిన తమిళ హీరో విక్రమ్ తాజా సినిమా తంగలాన్ గురించి ఓ ఇట్రస్టింగ్ అప్ డేట్ వచ్చింది. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన తంగలాన్ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంతో హీరో విక్రమ్ వెల్లడించిన పలు విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
Thangalaan movie updates
శివపుత్రుడు, నాన్న, అపరిచితుడు వంటి చిత్రాల తరహాలో తంగలాన్ లో తన నటన ఉంటుందని చెప్పకనే చెప్పిన విక్రమ్… ఈ సినిమాలో తనకు డైలాగ్ లు లేవని కుండబద్దలుగొట్టారు. రొటీన్ కు భిన్నంగా, ఆడియన్స్ కు ఎమోషనల్ గా కనెక్టైయ్యే డీ గ్లామర్ పాత్ర తంగలాన్ లో చేస్తున్నాని విక్రమ్ చెప్పారు.
అంతేకాదు తన జీవితంలో ఇలాంటి పాత్ర చేయలేదని తంగలాన్ తెగ జీవన శైలి ఇతివృత్తంగా సాగే ఈ సినిమా కోసం ఉదయం నుండి రాత్రి వరకు విశ్రాంతి లేకుండా లైవ్ సౌండ్ చేసామన్నారు. దీనితో తంగలాన్(Thangalaan) సినిమాపై అభిమానులు అంచనాలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే తనకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన శివపుత్రుడులో కూడా విక్రమ్ కు డైలాగ్ లు ఉండవు. దీనితో తంగలాన్ సినిమా శివపుత్రుడు సినిమాకు సీక్వెలా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదేగాని నిజం అయితే మరోసారి విక్రమ్ నట విశ్వరూపం చూడటానికి ఆశక్తిగా ఎదురుచూస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
దర్శకుడు పా రంజిత్ మరో సంచలనం
ప్రముఖ దర్శకుడు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న తంగలాన్ ను జనవరి 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ లో తంగలాన్ సినిమా టీజర్ ను రిలీజ్ చేసారు.
మరోసారి నార్త్ ను డాంబినేట్ చేయనున్న సౌత్ డైరెక్టర్
బాహుబలి సిరీస్, కేజిఎఫ్ సిరీస్, ఆర్ ఆర్ ఆర్ తరువాత ఇటీవల తమిళ దర్శకుడు అట్లి తెరకెక్కించిన జవాన్ సినిమా నార్త్ లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే తరహాలో పా రంజిత్ తెరకెక్కిస్తున్న తంగలాన్ ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
Also Read:Thangalaan: తూచ్ అంటున్న “తంగలాన్” సినిమా యూనిట్