Ira Khan Pre Wedding: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ వైరల్ గా మారారు. తను ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకునేందుకు అమీర్ ఖాన్ ఒప్పుకున్నాడు. ఇంకేం నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను హల్ చల్ చేస్తున్నాయి. ఇరా ఖాన్(Ira Khan) పెళ్లి చేసుకోబోయే భర్త పేరు నూపుర్. కెల్వన్ వేడుక జరుపు కోవడం సంప్రదాయంగా వస్తోంది.
Ira Khan Pre Wedding Updates
ఇందుకు సంబంధించి స్వయంగా ఇరా ఖాన్ తన వ్యక్తిగత ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. దీంతో మీడియా మొత్తం ఇరా పై ఫోకస్ పెట్టాయి. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ తన ముద్దుల కూతురును చూసి తెగ మురిసి పోయాడు. తనకు ఆమె అంటే పంచ ప్రాణం.
ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశాడు దిగ్గజ నటుడు. తను ప్రేమించిన వ్యక్తి తనకంటే సింప్లిసిటీని ఇష్ట పడతాడని, వారు జీవితాంతం ఆనందంగా ఉండాలన్నదే తన అభిమతమని పేర్కొన్నాడు.
ఈ ఇద్దరి పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశాడు తండ్రి అమీర్ ఖాన్. వచ్చే ఏడాది జనవరి 3న పెళ్లి జరుగుతుందని ఇప్పటికే ప్రకటించాడు. మొత్తంగా ఇరా ఖాన్, నూపుర్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
Also Read : PI Meena Web Series : పీఐ మీనా డిటెక్టివ్ థ్రిల్లర్