Say No To Piracy : చిన్న, మధ్య, భారీ బడ్జెట్ అంటూ తేడా లేకుండా అన్ని సినిమాలను పట్టి పీడిస్తున్న భూతం పైరసీ. కోటి రూపాయల ఖర్చుతో తీసిన లో బడ్జెట్ సినిమా అయినా… వేల కోట్లు పెట్టి తీసిన భారీ బడ్జెట్ చిత్రమైనా… అవి ధియేటర్లలో లేదా ఓటిటి ఫ్లాట్ ఫాంలలో విడుదలైన నిమిషాల్లో వాటి పైరసీ కంటెంట్ బయటకు వచ్చేస్తుంది. కేవలం ఒక్క పైరసీ వల్ల ప్రతి ఏడాది చిత్ర పరిశ్రమకు దాదాపు 20వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతోందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అంచానా. దీనితో ఈ పైరసీను అరికట్టి చలనచిత్ర పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కీలకమైన నిర్ణయం తీసుకుంది.
Say No To Piracy for Movies
సినిమాల విషయంలో జరుగుతున్న పైరసీని అరికట్టేందుకు, డిజిటల్ ప్లాట్‌ఫాంల నుంచి పైరసీ కంటెంట్‌ను తొలగించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) శుక్రవారం ప్రకటించారు. ‘పరిశ్రమ కోరుకున్న పెద్ద డిమాండ్‌ని మేము నెరవేర్చాము’ అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్(ఐఖీబీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)లో 12మంది నోడల్ అధికారులని నియమించామని, సినిమా పైరసీలకి సంబంధించిన కేసులను నమోదు చేసుకొని 48గంటల్లో చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ‘పైరసీ అనేది సినిమా రంగానికే కాదు ప్రపంచం మొత్తానికి పెనుముప్పు. దీనిపై ఇప్పుడు చర్యలు తప్పక తీసుకోవాల్సిందే’ అని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
పైరసీను అరికట్టడం ఎలా
యూట్యూబ్, టెలిగ్రామ్ ఛానల్స్, ఇతర వెబ్‌సైట్స్, ఆన్లైన్ ప్లాట్‌ఫాంల నుంచి తమ కంటెంట్‌ను తొలగించడానికి కాపీరైట్ హోల్డర్స్ లేదా ఆ కంటెంట్‌కు సంబంధించి అధికారం పొందిన ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసే ముందు సీబీఎఫ్సీ జారి చేసిన సర్టిఫికేట్‌ను, యాజమాన్య రుజువును అధికారులకు చూపించాలి. కేసు నమోదు చేసే ముందు వాస్తవికతను తెలుసుకోవడానికి నోడల్ అధికారులు విచారణలు చేపడతారు. పైరసీకి పాల్పడితే కఠినమైన జరిమానాలు విధించడానికి ఇటీవల నిర్వహించిన వర్షాకాల సమావేశాల్లో ఆమెదించిన సినిమాటోగ్రాఫ్ బిల్లులోని నిబంధనల ప్రకారం… కనీసం మూడు నెలల పాటు జైలు శిక్ష, రూ.3లక్షల జరిమానాలు ఉన్నాయి. గరిష్ఠంగా జైలు శిక్షను మూడేళ్ల వరకు పొడిగించవచ్చని, నిర్మాణ వ్యయంలో ఐదు శాతం జరిమానా ఉంటుంది.
Also Read : Mrunal Thakur: నాకు పెళ్ళి వద్దు బాబోయ్