భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న నటీమణులలో ఒకరు ఐశ్వర్య రాయ్ . తను విశ్వ సుందరిగా ఎన్నికైనా ఎక్కడా భేషజాలు అంటూ ప్రదర్శించని అరుదైన వ్యక్తిత్వం.
తన పుట్టిన రోజు సందర్బంగా సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఐశ్వర్య రాయ్ బచ్చన్ కు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ప్రత్యేకమైన ఫోటోను పంచుకున్నారు తన భర్త, నటుడు అభిషేక్ బచ్చన్. ఇవాళ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
నువ్వు వచ్చాక తనకు వెలుగు వచ్చిందంటూ పేర్కొన్నారు. జీవన ప్రయాణంలో ఒక్కొక్కరిది ఒక్కో దారి. కానీ నువ్వు మరీ ప్రత్యేకం అంటూ కొనియాడారు తన భార్య ఐష్ ను.
ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ షేర్ చేసిన ఫోటో, కామెంట్ వైరల్ గా మారాయి సోషల్ మీడియాలో. తన అందమంతా కళ్లల్లోనే ఉంటుంది. ఇదిలా ఉండగా ఐశ్వర్య రాయ్ లోని ప్రతిభను, నటనను మొదటగా గుర్తించింది తమిళ సినీ రంగానికి చెందిన దిగ్గజ దర్శకుడు సుహాసిని భర్త మణిరత్నం.
జీన్స్ లో నటించింది ఐశ్వర్య. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తాజాగా పొన్నియన్ సెల్వన్ లో మెరిసింది. తను సల్మాన్ ఖాన్ ప్రేమలో పడింది. కానీ పెళ్లి దాకా వచ్చి ఆగి పోయింది.