తమిళ సినీ రంగానికి చెందిన టాప్ యంగ్ డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ ఒకడు. సూపర్ స్టార్ జోసెఫ్ విజయ్ తో తీసిన లియో దుమ్ము రేపుతోంది. అక్టోబర్ 19న విడుదలైంది ఈ మూవీ. ఇందులో దళపతి తో పాటు అందాల ముద్దుగుమ్మ త్రిష కృష్ణన్ , సంజయ్ దత్, అర్జున్ నటించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు.
విడుదలైన రోజు డివైడ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలి రోజు ఏకంగా రూ.115.90 కోట్లు వసూలు చేసింది. 2వ రోజు రూ. 47.24 కోట్లు, 3వ రోజు రూ. 41.68 కోట్లు, 4వ రోజు రూ. 39.14 కోట్లు, 5వ రోజు రూ. 30.47 కోట్లు, 6వ రోజు రూ. 21.28 కోట్లు, 7వ రోజు రూ. 10.96 కోట్లు, 8వ రోజు రూ. 7.80 కోట్లు వచ్చాయి. మొత్తంగా లియో చిత్రం ఎనిమిది రోజులకు గాను రూ. 314.47 కోట్లు సాధించింది.
రాబోయే రోజుల్లో ఇంకెన్ని కోట్లు వసూలు చేస్తుందోనని అంచనా వేస్తున్నారు సినీ ట్రేడ్ వర్గాలు. లోకేష్ కనగరాజ్ ఇప్పటి వరకు దళపతి విజయ్ తో మాస్టర్ తీశాడు. తాజాగా లియోపై ఎక్కువగా అంచనాలు పెట్టుకున్నాడు దర్శకుడు. సినిమా విడుదల కంటే ముందు తిరుమలను దర్శించుకున్నారు.