సినీ , క్రీడా రంగాలలో ఎప్పుడు సక్సెస్ వస్తుందో చెప్పలేరు ఎవరూ. అందుకే ఈ రెండు రంగాలకు భారీ ఎత్తున క్రేజ్ ఉంటోంది. అనామకులు నిమిషాల్లోనే వైరల్ గా మారి పోతారు. దేశ వ్యాప్తంగా ఒక్క రోజులోనే టాప్ లో, ట్రెండింగ్ లోకి వచ్చేస్తారు.
అలాంటి కోవకు చెందినదే బేబీ మూవీలో నటించిన వైష్ణవి చైతన్య. తొలుతు షార్ట్ ఫిలింలో మెరిసింది. ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా మారి పోయింది ఒకే ఒక్క బేబీ మూవీతో. తెలంగాణ యాసతో అదుర్స్ అనిపించేలా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
విచిత్రం ఏమిటంటే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తనయుడు ఆనంద్ దేవరకొండతో నటించింది. వీరిద్దరి పెయిర్ సక్సెస్ బాట పట్టడంతో దర్శక, నిర్మాతలు వీరిద్దరితో మూవీస్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు టాక్. తాజాగా ఇదే కాంబినేషన్ లో కొత్త సినిమా ప్రారంభమైంది.
ఇదిలా ఉండగా ఒకే ఒక్క మూవీ భారీ సక్సెస్ కావడంతో వరుసగా ఆఫర్లు వస్తున్నాయట వైష్ణవి చైతన్యకు. దీంతో ఈ అమ్మడు ఆచి తూచి ఎంపిక చేసే పనిలో పడిందని సమాచారం. కేవలం కథకు ప్రాధాన్యత ఉంటేనే తాను ఒప్పుకుంటానని లేకపోతే ఎన్ని డబ్బులు ఇచ్చినా ససేమిరా అంటోందట.