బాలీవుడ్ నటి మలైకా అరోరా దుబాయ్ లో బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఇప్పటికే పలు విజయవంతమైన సినిమాలలో నటించింది..మెప్పించింది. మలైకా వయసు 48 ఏళ్లు. చూస్తే అలా అనిపించదు. ఈ ముద్దుగుమ్మ ఫిట్ నెస్ పై ఎక్కువగా దృష్టి పెడుతుంది. ఈ సందర్బంగా తను స్వయంగా ఫోటోలు, వీడియోలు పంచుకుంది.
సూర్యుడు వెళ్లి పోయాడు. తిరిగి ఉషోదయం ఉదయించింది. నాకు మరింత ఆహ్లాదకరంగా అనిపించింది. ఇవాళ పుట్టిన రోజు జరుపు కుంటున్నందుకు సంతోషంగా ఉంది. అంతకు మించిన మాటల్ని నేను చెప్పలేనంటూ పేర్కొంది మలైకా అరోరా.
నాకు అత్యంత ఇష్టమైన బాత్ రోబ్ లోనే ఉన్నానని తెలిపింది. నేను ఈ స్థాయిలో రావడానికి నాకు సహకరించిన వాళ్లు, నాకు అవకాశాల తలుపులు తట్టిన వాళ్లకు రుణపడి ఉన్నానని వినమ్రంగా తెలిపింది మలైకా. జీవితంలో ఇంతటి సక్సెస్ వస్తుందని అనుకోలేదు.
నన్ను గుర్తు పెట్టుకున్నందుకు ధన్యవాదాలు తెలిపింది మలైకా అరోరా. ఇదిలా ఉండగా తను బాలీవుడ్ టాప్ సాంగ్స్ లలో నటించింది. స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు.