బాలీవుడ్ నటి కృతీ సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. తాను సినీ రంగంలో పదే పదే జరిగే పార్టీలకు వెళ్లాలని అనిపించదని పేర్కొన్నారు. ఇతరులతో కలవడం వల్ల, లేదా వారితో స్నేహం చేయడం వల్ల సినిమాల్లో ఛాన్స్ లు రావని స్పష్టం చేశారు.
తాను కలలో కూడా అనుకోలేదని అవార్డు వస్తుందని అంటూ పేర్కొంది నటి కృతి సనన్. కష్టపడి నటిస్తే , మంచి పాత్రలు వస్తే సినిమాలు విజయవంతం అవుతాయని తాను నమ్ముతానని తెలిపారు. అందుకే కథలు బాగుండాలని కోరుకుంటానని, వాటికే ప్రయారిటీ ఇస్తానని చెప్పారు.
అవకాశాల కోసం ఒకరి వెంట పడడం తనకు నచ్చదని అన్నారు కృతీ సనన్. మనం ఎలా ఉంటామో ఎలా ప్రవర్తిస్తామో ఎలా నటిస్తామనే దానిపైనే మూవీస్ వస్తాయని పేర్కొన్నారు నటి. ఇదిలా ఉండగా తను డార్లింగ్ ప్రభాస్ తో కలిసి ఆది పురుష్ లో నటించింది. ఇందులో సీత పాత్ర పోషించింది. ఈ మూవీ తనకు మంచి పేరు తీసుకు వచ్చింది.