టాలీవుడ్ లో ఇటీవల రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది బేబి మూవీ. తక్కువ బడ్జెత్ తీసిన ఈ చిత్రం ఆశించిన దానికంటే కమర్షియల్ సినిమాలను కాదని వసూళ్లలో దూసుకు వెళ్లింది. ఏకంగా రూ. 90 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ట్రేడ్ , సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది.
బేబి చిత్రానికి దర్శకుడు సాయి రాజేష్. ఇందులో డ్రగ్స్ ఇష్యూకు సంబంధించి సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. నటుడు నవదీప్ పబ్ లో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఈ కేసుకు సంబంధించి బేబీ సినిమా దర్శక, నిర్మాతలకు కూడా నోటీసులు పంపించారు. ఇది కలకలం రేపింది.
ఇది పక్కన పెడితే తాజాగా ఈ ఇద్దరి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. ఇందుకు సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విశేషం ఏమిటంటే ఈ మూవీకి నూతన దర్శకుడు రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నాడు. బేబి సినిమా దర్శకుడు సాయి రాజేశ్ కథ తో పాటు నిర్మాతగా మారడం విస్తు పోయేలా చేసింది.