తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టైగర్ ష్రాఫ్ , కృతీ సనన్ కలిసి నటించారు గణపత్ చిత్రంలో. ఈ సినిమా సక్సెస్ కావాలని శుభాకాంక్షలు తెలిపారు తలైవా. ప్రస్తుతం ఆయన కేరళలో షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మధ్యన సోషల్ మీడియాలో మరింత చురుకుగా ఉన్నారు.
తాజాగా తమిళ సినీ సూపర్ స్టార్ గా పేరు పొందిన తళపతి విజయ్, త్రిష కృష్ణన్ , సంజయ్ దత్ కలిసి నటించిన లియో చిత్రం గురించి కూడా కీలక కామెంట్స్ చేశారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఆ చిత్రం కూడా అద్భుతంగా విజయం సాధించాలని కోరారు.
ఇదే సమయంలో తను నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటించిన జైలర్ దుమ్ము రేపింది. ఏకంగా రూ. 650 కోట్లు వసూలు చేసింది. ఇదిలా ఉండగా రజనీకాంత్ రూ. 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది.
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ యాజమాన్యం తీసింది. పెట్టిన ఇన్వెస్ట్ కు మూడింతలు రావడంతో ఫుల్ ఖుషీ అయ్యారు సంస్థ చైర్మన్ కళానిధి మారన్. తాజాగా గణపథ్ చిత్రం ప్రస్తుతం రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా రజనీకాంత్ ఆ సినిమా బిగ్ సక్సెస్ కావాలని కోరడంతో చిత్రంలో నటించిన హీరో హీరోయిన్లు ఫుల్ ఖుషీగా ఉన్నారు. తలైవాకు థ్యాంక్స్ తెలిపారు.