టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరో విక్టరీ వెంకటేష్. దగ్గుబాటి కుటుంబంలో తను భిన్నమైన పాత్రలు ఎంచుకుంటాడు. తండ్రి దివంగత రామానాయుడి పేరు నిలబెట్టాడు. ఏ మాత్రం వీలు చిక్కినా పుస్తకాలను చదవడం అలవాటు వెంకీకి. తాజాగా శైలేష్ కొలను రాసి దర్శకత్వం వహించిన సైంధవ్ సినిమా టీజర్ లాంచ్ చేశారు మూవీ మేకర్స్.
వెంకటేశ్ అభిమానులకు కిక్ ఎక్కించేలా తీశాడు దర్శకుడు. గతంలో ఘర్షణ లాంటి సినిమా కూడా చేసిన అనుభవం వెంకటేశ్ కు ఉంది. ఏ పాత్ర ఇచ్చినా అందుకు వంద శాతం న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తుంటాడు.
సైంధవ్ లో విక్టరీ వెంకీతో పాటు జాస్మిన్ , రుహానీ శర్మ, డాక్టర్ రేణు, శ్రద్ధా శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్దిఖీ, మనోజ్ఞ,, ఆర్య, ఆండ్రియా జెరమియా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై దీనిని విడుదల చేయనున్నారు. ఇప్పటికే మూవీ మేకర్స్ విడుదల తేదీని కూడా ఖరారు చేశారు. వచ్చే ఏడాది జనవరి 13న ముహూర్తం ఫిక్స్ చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా బలగం సినిమా తీసి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన కమెడియన్, దర్శకుడు వేణుతో వెంకటేశ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మొత్తంగా సైంధవ్ పై వెంకటేశ్ ఆశలు పెట్టుకున్నారు.