ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లియో చిత్రానికి బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమాను తెలుగులో లియోగా రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఈ మేరకు రైట్స్ కూడా అమ్మేశారు. అయితే లియో తెలుగు ను రిలీజ్ చేయొద్దంటూ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిపై విచారణ చేపట్టింది కోర్టు. ఈ మేరకు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. తెలుగులో లియో టైటిల్ ను అనుమతి లేకుండా ఉపయోగించారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది లియో నిర్మాతలకు .
ఈనెల 20వ తేదీ వరకు లియో తెలుగు మూవీ విడుదలను నిలిపి వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ టెన్షన్ కు లోనయ్యారు. మరో వైపు తళపతి విజయ్ , త్రిష కృష్ణన్ , సంజయ్ దత్ కలిసి నటించారు లియో చిత్రంలో. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్.
ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.