యూట్యూబ్ లో ఒకే ఒక్క సాంగ్ దుమ్ము రేపుతోంది. చిన్నారుల నుంచి పెద్ద వారి దాకా నైనా అంటూ పాడుకుంటున్నారు. హమ్ చేస్తూ సంతోషానికి లోనవుతున్నారు. సమస్త మానవ జాతిని మెస్మరైజ్ చేసేది ఒకే ఒక్క సాధనం సంగీతం. ఇంతకూ నైనా మిలైకే సాంగ్ ఇంతలా పాపులర్ కావడానికి, మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించడానికి ఒకే ఒక్క కారణం ముంబైకి చెందిన ప్రముఖ సింగర్ ధ్వని భానుశాలి.
మహారాష్ట్ర లోని ముంబై స్వస్థలం. ఆ వాయిస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మార్చి 22న 1998లో పుట్టారు ధ్వని. పాప్ సింగర్ గా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె విడుదల చేసిన ఈ సాంగ్ ఇప్పుడు రికార్డుల మోత మోగిస్తోంది. కుర్ర కారు గుండెల్ని మీటుతోంది. మై దిల్ నా హారా అంటూ అలవోకగా పాడుతుంటే యూత్ కెవ్వు కేక పెడుతోంది.
2019లో వాస్తే పేరుతో సింగిల్ రిలీజ్ చేసింది. ఇది యూట్యూబ్ లో 1.4 బిలియన్ల వ్యూస్ పొందింది. ఒక బిలియన్ వ్యూస్ సాధించిన తొలి అతి పిన్న వయసు కలిగిన సింగర్ గా రికార్డు బ్రేక్ చేసింది ధ్వని భానుశాలి. తండ్రి టీ సీరీస్ గ్లోబల్ మార్కెటింగ్ , మీడియా పబ్లిషింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. 2021లో స్వంత స్టూడియో ఏర్పాటు చేసింది ధ్వని భానుశాలి.
ప్రముఖ సింగర్ నేహా కక్కర్ తో కలిసి ఆల్బమ్స్ విడుదల చేసింది. ఇద్దరూ టాప్ సింగర్స్ గా పేరు పొందారు. అవును పాటంటే పూల తోట కదూ..గుండెల్ని చిదిమే రక్తం కదూ.