మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన సామ్ బహదూర్ మూవీ టీజర్ ఇవాళ విడుదలైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు విక్కీ కౌశల్ , ఫాతిమా సనా షేక్ , సన్యా మల్హోత్రా హాజరయ్యారు. ఇందిరా గాంధీగా ఫాతిమా సనా షేక్ , సామ్ మేనాక్షా భార్య సిలూగా సన్యా మల్హత్రా నటించారు. సామ్ బహదూర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 1న విడుదల కానుంది.
ఈ మూవీని ఆర్ఎస్పీవీపీ మూవీస్ నిర్మించారు. ఆర్మీ యూనిఫాం ధరించడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పాడు నటుడు విక్కీ కౌశల్. ఎందుకంటే ఈ దేశం కోసం వాళ్లు తమ ప్రాణాలను అర్పిస్తున్నారు. అంతే కాదు తమ కుటుంబాలకు దూరంగా బాధ్యతలను నిర్వహిస్తున్నారని కితాబు ఇచ్చాడు.
ఇదిలా ఉండగా సామ్ బహదూర్ మూవీ 1971లో ఇండో పాకిస్తాన్ యుద్దదంలో భారత సైన్యం ఆర్మీ స్టాఫ్ చీఫ్ గా పని చేశారు సామ్ మానెక్షా . ఆయన జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు మేఘనా గుల్జార్. అంతే కాదు ఫీల్డ్ మార్షల్ స్థాయికి పదోన్నతి పొందిన మొదటి భారతీయ ఆర్మీ అధికారి కావడం విశేషం.