డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో పలు చిత్రాలు ఈ మధ్యన వస్తున్నాయి. తమిళ సినీ ఇండస్ట్రీలో ఇవి కాస్తా ఎక్కువే. తాజాగా టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఫోకస్ కలిగి ఉన్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ మధ్యన మనోడు లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఇంటిల్లి పాది ఆకట్టుకునేలా మంచి కాన్సెప్ట్ తో పెళ్లి చూపులు పేరుతో సినిమా తీశాడు. అది ఊహించని రీతిలో బిగ్ సక్సెస్ అయ్యింది.
ఆ సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది తీశాడు. ఇది కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా డిఫరెంట్ కథతో ముందుకు వచ్చాడు తరుణ్ భాస్కర్. చిత్రం పేరు కూడా భిన్నంగా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ప్రస్తుతం సినిమాలో కొత్తదనం లేక పోయినా , కామెడీ ట్రాక్ పండక పోయినా జనం తిరస్కరిస్తున్నారు. కథ బాగుంటే హీరో, హీరోయిన్లు ఎవరు ఉన్నా లేక పోయినా డోంట్ కేర్ అంటున్నారు.
ఇక తరుణ్ భాస్కర్ తాజా చిత్రానికి పెట్టిన పేరు కీడా కోలా. ఇది పూర్తిగా క్రైమ్, కామెడీ కథాంశంతో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. విచిత్రం ఏమిటంటే ఇవాల్టి నుంచే సినిమా ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. ఇందుకు సంబంధించి తాజాగా ట్విట్టర్ వేదికగా ఫోటోలు షేర్ చేశాడు దర్శకుడు తరుణ్ భాస్కర్.