నట సింహం బాలయ్య బాబు , అందాల ముద్దుగుమ్మ శ్రీలీల, లవ్లీ విమెన్ కాజల్ అగర్వాల్ కలిసి నటించిన భగవంత్ కేసరి చిత్రం ట్రైలర్ విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ కార్యక్రమం వరంగల్ లో చోటు చేసుకుంది. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
అద్భుతమైన సన్నివేశాలు, సెంటిమెంట్ , థ్రిల్లర్, యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. సినిమాకు సంబంధించి అద్భుతమైన సంగీతం అందించాడు ఎస్ఎస్ థమన్. కంటిన్యూగా బాలయ్య బాబు నటించే సినిమాలకు మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్నాడు.
అద్బుతమైన బ్యాక్ గ్రౌండ్ ఇచ్చాడు. కాసర్ల శ్యామ్ , రామయ్య జోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్ పాటలు రాశారు. భగవంత్ కేసిరికి అద్భుతమైన ఆదరణ లభించింది. మరోసారి తన సత్తా ఏమిటో చూపించాడు నట సింహం నందమూరి బాలకృష్ణ.
ఇప్పుడు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా డైరెక్టర్ అనిల్ రావిపూడి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన బాలకృష్ణను ఆలింగనం చేసుకున్నారు. తన జీవితంలో మరిచి పోలేని నటుడు బాలయ్య అంటూ కితాబు ఇచ్చారు. అక్టోబర్ 16న ఈ చిత్రం రాబోతోంది.