ప్రస్తుతం బుల్లి తెర, వెండి తెర కంటే ఓటీటీలే ఎక్కువగా డామినేట్ చేస్తున్నాయి. జనం టాకీసుల కంటే ఓటీటీలలో చూసేందుకు ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. దీంతో సినిమా రంగానికి చెందిన చాలా మంది నటీ నటులు ఓటీటీ వెబ్ సీరీస్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇప్పటికే అటు సినిమాల్లో ఇటు వెబ్ సీరీస్ లలో నటిస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఇందుకు ఉదాహరణ అజయ్ దేవగణ్ భార్య ప్రముఖ నటి కాజోల్ కూడా నటించింది. ఆమె రెచ్చి పోయి లిప్ కిస్ లు ఇస్తూ కిర్రాక్ తెప్పించింది.
ఇక తమన్నా భాటియా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాలలో బిజీగా మారి పోయింది. ఇటీవలే విడుదలై దుమ్ము రేపింది రజనీకాంత్ నటించిన జైలర్. ఇందులో కీలక పాత్ర పోషించింది తమన్నా భాటియా.
ఇదే అమ్మడు పూర్తిగా బెడ్ సీన్స్ తో రెచ్చి పోయి నటించింది లస్ట్ వెబ్ సీరీస్ లో. ఇది హాట్ టాపిక్ గా మారి పోయింది. ఇక ఇప్పటికే ఆర్యా వెబ్ సీరీస్ తో ఆకట్టుకున్న ప్రముఖ నటి సుష్మితా సేన్ సీజన్ 3 పేరుతో ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీగా ఉంది.
ఈ సీరీస్ పూర్తిగా క్రైమ్, యాక్షన్ , థ్రిల్లర్ నేపథ్యంగా తీశాడు దర్శకుడు. ఆర్య సరీన్ గా సుస్మితా సేన్ , దౌలత్ గా సికందర్ ఖేర్, జవహర్ గా వికాస్ కుమార్ నటించారు. ఇది హాట్ స్టార్ లో లభ్యం అవుతోంది.