తెలుగు సినిమా రంగంలో టాప్ లో కొనసాగుతున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన తనయులు నాగేంద్ర బాబు, పవన్ కళ్యాణ్ తో పాటు మేనల్లుడు అల్లు అర్జున్ , వరుణ్ తేజ్ , ఇతర కుటుంబానికి చెందిన వారందరితో ఫ్యామిలీ మొత్తం ఫోటో దిగారు.
ఇందుకు సంబంధించిన పిక్చర్ ను స్వయంగా చిరంజీవి షేర్ చేయడం విశేషం. షేర్ చేసిన కొద్ది నిమిషాలకే వైరల్ గా మారింది నెట్టింట్లో . ఇదిలా ఉండగా నటుడు వరుణ్ తేజ్ , నటి లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు సంబంధించి ఈ ఫోటోలు తీశారు.
మెగా ఫ్యామిలీ మొత్తం ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. అయితే నవంబర్ లేదా డిసెంబర్ నెలలో వరుణ్ తేజ్ , లావణ్య ల వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇప్పటి నుంచే పెళ్లి ఏర్పాట్లు చేయనున్నట్లు టాక్.
మరో వైపు కొణిదెల నాగబాబు కూతురు నిహారిక పెళ్లి ఘనంగా జరిగినా తర్వాత అది విడాకుల దాకా దారి తీసింది. నిహారిక ప్రవర్తన సరిగా లేక పోవడం వల్లనే తాము దూరంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇది ఒక రకంగా మెగా ఫ్యామిలీకి ఇబ్బందికరంగా మారింది. మరో వైపు చిరంజీవి కూతురు విషయంలో కూడా ఇదే జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికీ పలువురిని పెళ్లి చేసుకోవడం చర్చకు దారి తీసింది.