పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ మధ్యన టాప్ లో కొనసాగింది. కానీ తళపతి విజయ్ తో నటించిన బీస్ట్ , డార్లింగ్ ప్రభాస్ తో చేసిన రాధే శ్యామ్ ఆశించిన మేర ఆడలేదు. దీంతో పూజా హెగ్డే కు తీవ్ర నిరాశ ఎదురైంది.
ఇదే సమయంలో ప్రముఖ నటుడు మహేష్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న గుంటూరు కారం మూవీకి ఎంపికైంది. ఆమెతోనే సినిమాకు క్లాప్ కొట్టారు. కానీ ఏమైందో ఏమో కానీ సడెన్ గా పూజా హెగ్డే సినిమా నుంచి తప్పుకున్నారు.
మహేష్ బాబు వల్లనే తాను తప్పు కోవాల్సి వచ్చిందని జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై ఇద్దరు నటులు బయటకు చెప్పలేదు. తాజాగా గుంటూరు కారం చిత్రం నిర్మాత కీలక వ్యాఖ్యలు చేశారు. బయట జరుగుతున్న ప్రచారం అబద్దమన్నారు.
పూజా హెగ్డే ను మహేష్ బాబు వద్దన లేదని, తను హిందీ మూవీతో చేస్తుండడం వల్ల ఇక్కడ మూవీకి వర్కవుట్ కాలేదని అందుకే వదులు కున్నామని తెలిపారు. మొత్తంగా లోపల ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ శ్రీలీల వచ్చేసింది ఈ మూవీలో.