తమిళనాడు సినీ రంగంలో మోస్ట్ పాపులర్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త మూవీకి ఓకే చెప్పారు. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తను నటించిన జైలర్ ఊహించని రీతిలో భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. తక్కువ వ్యవధిలోనే రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ తరుణంలో నెక్ట్స్ చిత్రం ఎవరితో చేస్తారన్న ఉత్కంఠకు తెర దించాడు రజనీకాంత్.
తాజాగా మరో దిగ్గజ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో తదుపరి చిత్రాన్ని చేయబోతున్నట్లు ప్రకటించాడు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ తెగ ముచ్చట పడుతున్నారు. దీనికి పేరు కూడా పెట్టారు. తలైవర్ 171 నామకరణం చేశారు.
జైలర్ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ రజనీకాంత్ తో లోకేష్ కనగరాజ్ తీయబోయే సినిమాను కూడా నిర్మిస్తుంది. ఈ మూవీకి స్వర కర్తగా అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు.
అన్బు అరివు కొరియోగ్రాఫర్ అందించనునున్నారు. ఈ విషయాన్ని సినీ నిర్మాణ సంస్థ ప్రకటించింది. ట్విట్టర్ వేదికగా శనివారం వెల్లడించింది సన్ పిక్చర్స్. తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. అదేమిటంటే త్రిష కృష్ణన్ రజనీకాంత్ తో నటించనుంది.